రైతు సమస్యలే అజెండగా ప్రజల్లోకి : ఎంపీ నామ

హైదరాబాద్ లో కేసీఆర్‌ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న

ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 18 (ప్రజాబలం) బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కీలక సమీక్ష నిర్వహించారు. ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిగతా అభ్యర్థులతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కు కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు, అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పైన, పార్లమెంట్ ఎన్నికల ప్రచార సరళిపై , వారితో విస్తృతంగా చర్చించారు.సరికొత్త పందా లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు నామ తెలిపారు. రైతు సమస్యలు అజెండాగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని తెలిపారు. ఉదయం పూట పొలం బాట పట్టి ఎండిన పంట పొలాలను పరిశీలించిన తర్వాత రోడ్డు షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. పలు చోట్ల భారీ బహిరంగ సభలకుకూడా ప్లాన్ చేసినట్లు నామ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులకు నియమావళి ప్రకారం రూ.95 లక్షల చెక్కులను అందజేశారు ఈ సమావేశంలో పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు,ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు,జిల్లాకు చెందిన మాజీ శాసన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking