జిల్లా పాలనాధికారి,కలెక్టర్ బదావత్ సంతోష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 18 : లోక్ సభ నియోజకవర్గం ఎన్నికలలో భాగంగా ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థుల నుండి నామినేషన్ స్వీకరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగిందని జిల్లా పాలనాధికారి కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకారం రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజవర్గ లకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా 002 పెద్దపల్లి (ఎస్ సి) పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జిల్లాలోని 002-చెన్నూర్ (ఎస్.సి) 003-బెల్లంపల్లి 004 మంచిర్యాల శాసనసభ నియోజకవర్గంలోని ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 25వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయం పెద్దపల్లి లోని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ / పెద్దపల్లి సహాయక రిటర్నింగ్ అధికారి రెవిన్యూ డివిజనల్ అధికారి- పెద్దపల్లి లకు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తమ నామినేషన్ సమర్పించవచ్చని, నామినేషన్ ఫార్ములాను నిర్దేశిత పని వీళ్ళ యందు పొందవచ్చుని తెలిపాడు.ఈ నెల 26 వ తేదీ ఉదయం 11: 00 గంటల నుండి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ – పెద్దపల్లి నందు నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, అభ్యర్థిత్వము ఉపసంహరించుకోను నోటీసులను అభ్యర్థి స్వయంగా కానీ, ప్రతిపాదకులచే కాని, ఎన్నికల ఏజెంట్ కానీ అభ్యర్థి చేత రాత పూర్వకంగా ఈ నెల 29 వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలలో గల అంద చేయవచ్చని తెలిపారు. తుది జాబితా అనంతరం మే 13 వ తేదీ న కూలింగ్ నియమించడం జరుగుతుందని, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మే 13 వ తేదీ ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఇందు కొరకు జిల్లాలోని 002 చెన్నూర్ (ఎస్ సి)లో 227,003-బెల్లంపల్లి (ఎస్ సి) లో 227 ,004- మంచిర్యాల లోని 288 మొత్తం గా 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి సౌకర్యాలు కల్పించడం జరిగిందని, దివ్యాంగులు, వయోవృద్ధులు,గర్భిణీలకు కొరకు ర్యాంపు దిల్ చైర్ సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ రోజున ప్రభుత్వంచే జారి చేయబడిన గుర్తింపు కార్డుతో ఏదైనా ఉపయోగించుకొని ఓటర్ వేయవచ్చని తెలిపారు.