ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 12 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి కార్తీక పౌర్ణమి జాతర సందర్భంగా దర్శనం కోసం వస్తున్న భక్తులకు కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పులిహోర మజ్జిగ మంచినీరు భక్తులకు అందజేస్తున్నారు.తేదీ 12-11-2024 మంగళవారం రోజు నుండి తేదీ 15-11-2024 శుక్రవారం జాతర ముగింపు వరకు ఇట్టి కార్యక్రమం కలదు ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామి దర్శనార్థమై వస్తున్న సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.మొదటి రోజు దండేపల్లి మండలం కాసిపేట గ్రామ కమిటీ కాంగ్రెస్ నాయకులు సేవ కార్యం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన మంచిర్యాల జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి,యూత్ కాంగ్రెస్ నాయకులు లక్కాకుల సృజన్,సిరికొండ నవీన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,బత్తుల రమేష్ తోట రాజయ్య కోడి నరేష్ మాదాసు సత్యనారాయణ లక్కాకుల అనిల్ తర్ర లక్ష్మణ్ దాసరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.