మనోహరాబాద్, నవంబర్ 12 ( ప్రజాబలం న్యూస్):
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలో అక్రమ పిడిఎస్ రైస్ రవాణా చేస్తున్నారని సమాచారం రాగ సివిల్ సప్లై, రెవిన్యూ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ శాఖ వారు పిడిఎఫ్ రైస్ ను వెంబడించి పట్టుకొని స్వాధీన పరుచుకున్నారు. సుమారు 80 క్వింటాళ్ల బియ్యాన్ని బుస్స లింగం సూరారం జీడిమెట్ల వద్ద నుండి రెండు అశోక్ లేలాండ్ వెహికల్ ను ఏర్పాటు చేసి డ్రైవర్లు ద్వారా బియ్యాన్ని దండుపల్లి గ్రామంలో శివ అనే వ్యక్తికి అమ్మడానికి రాగ పట్టుకున్నామని సివిల్ సప్లై, రెవెన్యూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయడం జరుగుతుంది, పిడిఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సేఫ్ కస్టర్డ్ నిమిత్తం 2 అశోక్ లేలాండ్ వెహికల్లను పోలీస్ కస్టడీకి అప్పగించామని మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.