ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 12:సోమవారం వికారాబాదు జిల్లా, దుద్యల మండలం, లగిచెర్ల గ్రామంలో జిల్లా కలెక్టరు, అదనపు కలెక్టరు, ఇతర అధికారుల పై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో బోజన విరామ సమయంలో జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి తో కలిసి తెలంగాణ గజిటెడ్ ఆఫీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాయంత్రాంగం, అధికారులు అందరూ నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు . ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అధికారులకు భద్రత కల్పించాలని కోరారు. ఇటువంటి ఘటన వల్ల అభద్రత భావన కలుగుతుందని,ఈ దాడికి పాల్పడిన వారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి దాడులు పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు.