గుడిరేవు గ్రామం ఐకెపి కేంద్రాలను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,ప్రేమ్ చంద్,వైస్ చైర్మన్ ఎండీ ఆరిఫ్
ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 12 : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ సాగర్ రావు ఆదేశాల మేరకు దండేపల్లి మండలంలోని గుడి రేవు గ్రామంలో ఐకెపి కేంద్రాలను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్,వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి మంగళవారం రోజున ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…దండేపల్లి మండలంలోని గుడి రేవు గ్రామంలో ఐకెపి కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని రైతులకు ఎలాంటి కష్టం కలగకుండా ఐకెపి సెంటర్ వద్ద వడ్లను కొరడం జరుగుతుందని, దళారులను నమ్మి వడ్లు అమ్మ వద్దని తెలిపారు.రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐకెపి సభ్యులు,రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,యూత్ నాయకులు పాల్గొన్నారు.