మెదక్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మెదక్ లో ఉద్యోగాలు.

లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ,మరియు ప్రధాన న్యాయమూర్తి
లక్ష్మీ శారద

మెదక్ 12 నవంబర్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ లో
స్టెనో/టైపిస్ట్- 1,
రికార్డు అసిస్టెంట్ -1,
ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, 13-11-2024 వ తేదీ నుంచి 23-11-2024 వ తేదీ వరకు దరఖాస్తును నేరుగా రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెదక్ కోర్టు సముదాయంలో అందించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ మరియు ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారద బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్టెనో టైపిస్ట్ పోస్ట్ కు18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని, ఎస్సీ ,ఎస్టీ,
బి సి డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 12 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుందన్నారు. గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి డిగ్రీ కలిగి ఉండి, ఇంగ్లీష్ షాట్ హాండ్ లో 120 (w.p.m) డబ్ల్యూ పి ఎం స్పీడ్ లేదా ఇంగ్లీష్ హయ్యర్ గ్రేట్ టైపు రైటింగ్ లో 45 (w.p.m) డబ్ల్యూ పి ఎం స్పీడ్ కలిగిన వారు అర్హులన్నారు.
రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు పదవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలని ,18 సంవత్సరాల వయసు నుంచి 34 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని, వయసు సలింపు పై విధంగా అర్హులవుతారు అన్నారు. వచ్చిన దరఖాస్తుల (స్కూటీని అనంతరం ఈనెల 30న హాల్ టికెట్లు అందజేస్తారని,
7-12-2024 రోజున రాత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
అర్హత గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం తో పాటు ఓసి, బీసీ అభ్యర్థులు 800 రూపాయలతో డీడిని, ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులు 400 రూపాయల డిడిని
” ద సెక్రెటరీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెదక్”
(the secretary district legal services authority Medak) పేరుమీద పంపాలన్నారు.
మరిన్ని వివరాల కోసం (https://medak.dcourts.gov.in/) సంప్రదించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking