డబ్బులు స్వాహా చేసిన సహారా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

-పోలీసులు న్యాయం చేయాలని వేడుకోలు

ప్రజా బలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 12 :

సహారాలో తను దాచుకున్న డబ్బును డిపాజిట్ చేయకుండా మోసం చేసిన సహారా ఏజెంట్ డి. శ్రీనివాసరావు, మేనేజర్ ఎస్. టి. రావులు చర్యలు తీసుకోవాలని బాధితుడు చిలుక సంజీవ్ ఆన్నారు. వివరాల్లోకి వెళితే మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన చిలుక సంజీవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో తనగోడు వెళ్ళబోసుకున్నాడు. 2014 వ సంవత్సరంలో 2 లక్షల రూపాయలను సహరాలో ఆరు సంవత్సరాల కాలం వరకు ఫిక్స్ డిపాజిట్ చేసానన్నారు. 2020 వరకు 5,14,092 రూపాయలు వస్తాయని బాండు ఇచ్చారని తెలిపారు. గడువు తీరిన తరువాత నా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా  సహారా సెబి హ్యాండ్ వార్ లో ఉన్నాయని మాకేం సంబంధం లేదని ఏజెంట్ శ్రీనివాసరావు, మేనేజర్ ఎస్ టి రావు లు చెబుతున్నారని వాపోయాడు. దీనిపై అనుమానం వచ్చి హైదరాబాద్ జోనల్ ఆఫీస్ కి వెళ్లి కలవగా మాస్టర్ కాపీ, మెంబర్షిప్, అకౌంట్ ఓపెనింగ్ ఆన్లైన్లో లేవని తెలిపారు. తిరిగి నేను సి ఆర్ సి ఎస్ పోర్టల్ లో అప్లోడ్ చేయగా నా బాండ్స్ ఆన్లైన్లో కూడా లేవని నాకు  తెలిసింది. ఇలాగే మందమర్రిలో ఉన్నటువంటి 90 శాతం మంది ఇదే పరిస్థితిలో అయోమయంలో ఉన్నారన్నారు. ప్రస్తుతం వీరిద్దరు చేసిన మోసం వల్ల నా ఆర్థిక పరిస్థితి చాలా దీనమైన స్థితిలో ఉందని పూట గడవడమే చాలా కష్టంగా మారిందన్నారు. ఈ విషయంపై స్థానిక మందమర్రి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై ఏజెంట్ డి శ్రీనివాసరావు మేనేజర్ ఎస్ టి రావులతో పాటు సహారా ఇండియా సంస్థపై చట్టపరమైన కేసులు నమోదు చేసి నా డబ్బులు నాకు ఇప్పించి అధికారులు న్యాయం చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking