బొగ్గు గనుల పరిరక్షణకై 14న రౌండ్ టేబుల్ సమావేశం

-సిపిఐ(యం) జిల్లా కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 12 :

బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేసి, సింగరేణికే బొగ్గు గనులను కేటాయించాలని కోరుతూ సిపిఐ(యం) ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో ఈ నెల 14న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసమావేశంకు పట్టణంలోని మేధావులు, వివిధ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ రౌండ్ టేబుల్ పాల్గొనాలని కోరారు. సింగరేణిని పరిరక్షించుకోవడానికి వారి వారి ఆలోచన విధానాలను, సలహాలను, సూచనలను తెలపాలన్నారు. దీనిపై కార్యరూపం తీసుకొని ముందుకు వెళ్లడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని మనందరం ఐక్యంగా కలిసి రక్షించుకుంటేనే రేపటి మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు భరోసా కోసం ఈ సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking