సంగారెడ్డి ఏప్రిల్ 25 ప్రజ బలం ప్రతినిది:
గుండె పోటుతో హఠాన్మరణం చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు పద్మారావు కుటుంబాన్ని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ కోహిర్ లో వారి స్వగృహంలో పరామర్శించారు. జిల్లాలో ఎమ్మార్పీఎస్ నడిపిన సామాజిక ఉద్యమాల్లో పద్మారావు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. పద్మారావు మరణం కుటుంబానికి, ఉద్యమానికి తీరని లోటని అన్నారు. ఉద్యమంలో కొత్త తరానికి నిరంతరం స్ఫూర్తిని నింపేవారన్నారు. కుటుంబానికి అండగా ఎమ్మార్పీఎస్ ఉంటుందన్నారు.
ఆయన వెంట ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమకారుడు డప్పోల్ల రమేష్, మాతంగి చిరంజీవి మదిగ, ఎమ్మార్పియస్ సంగారెడ్డి జిల్లా కొ ఇంచ్చార్జీ, అబ్రహం మాదిగ, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇంచ్చార్జీ, సంపత్, శ్రీకాంత్, శీవకూమార్, రాజు, తదితరులు ఉన్నారు.