మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..
. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి ఏప్రిల్ 25 ప్రజ బలం ప్రతినిది:
ఈనెల 29న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నందున ఆయా కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆయా అధికారులకు ఆదేశించారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి, రెవిన్యూ, గ్రామీణ అభివృద్ధి, సదాశివపేట మున్సిపల్ కమిషనర్, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 29న మంత్రి సంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని, ఆయా కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సంబంధిత అధికారులు ప్రణాళికతో చేయాలన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
సదాశివపేట మున్సిపాలిటీ సిద్ధాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ప్రారంభింస్తారని, లబ్ధిదారులకు ఇంటి పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేస్తారని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఆయా మౌలిక వసతులను మరోసారి పరిశీలించాలని సూచించారు.
మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామం వద్ద సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులకు
మంత్రి భూమి పూజ చేయనున్నందున ఆయా ఏర్పాట్లను సంబంధిత అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇట్టి కార్యక్రమానికి విచ్చేయు ప్రజా ప్రతినిధులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయా అధికారులు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ సురేష్, వ్యవసాయ శాఖ జేడి నరసింహారావు, డి ఆర్ డి ఏ అడిషనల్ పీడీ సూర్యరావు, ఆర్డిఓ నగేష్, సదాశివపేట మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.