నిర్మల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ

 

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మావేశం

భారీగా త‌ర‌లివ‌చ్చిన పార్టీ శ్రేణులు

ఊరు వాడ‌ల గులాబీ జెండా పండుగ‌

నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్క‌రించిన మంత్రి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..  నిర్మల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభను నిర్వ‌హించారు. సభా ప్రాంగణంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను పార్టీ శ్రేణుల‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్క‌రించారు. అనంత‌రం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరులకు నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించారు.

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రిగింది. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్వాగతం ఉపన్యాసం చేశారు. ఇందులో పార్టీ ప్రాధాన్యతా అంశాలపై ముఖ్య నాయకులు చర్చించారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో సాధించిన ప్రగతిని వివ‌రించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ మోకాలడ్డుతున్న తీరును ఎండ‌గ‌ట్టారు.  బీఆర్‌ఎస్‌ పార్టీ సాధించిన ప్రగతితో పాటు బీజేపీ వైఫల్యాల‌పై  తీర్మానాలను ప్రవేశపెట్టి,  కరతాళధ్వనులతో వాటిని ఆమోదించారు.

స‌మావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడారు.బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తూ.వాటిని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌పై ఉంద‌న్నారు.రానున్న ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే స‌న్న‌ద్ధం కావాల‌ని శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ ప‌ట్ల  క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న  బీజేపీ  కేంద్ర ప్ర‌భుత్వ తీరును ఆయ‌న‌ ఎండ‌గ‌ట్టారు.

స‌మావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడారు.బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తూ..వాటిని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌పై ఉంద‌న్నారు.రానున్న ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే స‌న్న‌ద్ధం కావాల‌ని శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

ప‌రిపాల‌నా ధ‌క్ష‌త క‌లిగిన సీయం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అభివృద్ధి,సంక్షేమ ప‌థ‌కాల‌లో దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని తెలిపారు. ఉమ్మ‌డి పాల‌న‌లో తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డార‌ని, స్వ‌రాష్ట్రంలో వాటిని అధిగ‌మించి మిగితా రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నామ‌ని తెలిపారు. మ‌హారాష్ట్ర‌లో కూడా సీయం కేసీఆర్ స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మార‌థం ప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. నాలుగున్న‌ర కోట్లు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుంటే.మాన‌వ వ‌న‌రులు, స‌హ‌జ వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్న భార‌త‌దేశం కేంద్ర ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల వెనుక‌బ‌డి ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప‌ట్ల  క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీ  కేంద్ర ప్ర‌భుత్వ తీరును ఈ సంద‌ర్భంగా ఎండ‌గ‌ట్టారు.

మ‌రోవైపు మాజీ ఎమ్మెల్యే మ‌హేశ్వ‌ర్ రెడ్డి ఆ పార్టీ,ఈ పార్టీ అని చివ‌ర‌కు మ‌త‌తత్వ పార్టీ బీజేపీ లో చేరాడ‌ని ఎద్దేవా చేశారు.మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి ఓట్లు దండుకునే బీజేపీ దేశానికి,తెలంగాణ‌కు చేసిందేమి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

నిర్మ‌ల్  జిల్లా కేంద్రంలో క్యాంప్ కార్యాయ‌ల‌యంతో పాటు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ప‌లు వాడ‌ల్లో  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  బుల్లెట్ బండిపై మంత్రి ప‌ట్ట‌ణ‌మంతా క‌లియ తిరుగుతూ..గుల‌బీ జెండాను ఎగుర‌వేసి శ్రేణుల్లో జోష్ ను నింపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking