బీఎస్పీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జి అయితగాని శ్రీనివాస్ గౌడ్
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 25 (ప్రజాబలం) ఖమ్మం మే 7 వ తేదీన హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ భరోసా సభను జయప్రదం చేయాలని బీఎస్పీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జి అయితగాని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు బీఎస్పీ ఖమ్మం అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ భరోసా సభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభను విజయవంతం చేయడానికి కమిటీ సభ్యులు నిర్వహించాల్సిన విధి విధానాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దొరల తెలంగాణను సాధించి నరక కూపంలోకి నెట్టబడిన బహుజన ప్రజానీకానికి మేమున్నాం అనే భరోసాను కల్పించడానికి బెహన్ జీ కుమారి మాయావతి గారు హైదరాబాద్ వస్తున్నారు అన్నారు. తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించబడే తెలంగాణ భరోసా సభకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బహుజన సీనియర్ నాయకులు, సభ నిర్వహణ కమిటీ సభ్యులు దమెళ్ళ సత్యనారాయణ, మట్టె గురుమూర్తి, బైరు వెంకన్న, గుద్దేటి గురుమూర్తి, యద్దెనపుడి బ్రహ్మం మరియు ఇతర బహుజన నాయకులు పాల్గొన్నారు.