పందేన్వాగుతో దోమల సమస్య

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 8 మార్చి 2025
గుడ్ మార్నింగ్ మణికొండ మార్నింగ్ వాక్ సందర్భముగా భారత రాష్ట్ర సమితి – మణికొండ కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో కలసి కట్టుగా శనివారం మణికొండ పరిధిలోని బాపిస్ట్ చర్చ్, వీకర్స్ సెక్షన్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీ, పోచమ్మ గుడి పరిసర ప్రాంతల లోని ముఖ్య సమస్య పందేన్ వాగులోని దుర్గాంధంతో పాటు దోమల బెడదతో స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని వాపోతూ ఇట్టి సమస్యకు పరిష్కార మార్గం వెంటనే చేపట్టాలని ప్రతిబింబించిన స్థానిక నాయకులు భాను చందర్, శ్రీనాత్, మోహన కృష్ణలు ప్రముఖ పాత్రగా తీసుకొన్న విధముగా తదుపరి సమస్యలయిన నీటి సరఫరా పెంపుదలకు గాను ఆరు ఇంచిల పైప్ లైన్ వేస్తూ దానితో పాటు డ్రైనేజీ లైన్ కూడా వేయాలని స్థానిక ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియ చేసినారు కావున సంబంధిత జలమండలి అధికారులు, మునిసిపల్ అధకారులు ప్రజా సంక్షేమం దృష్ట్యా తగిన పరిష్కారం కొరకు సహకరిస్తూ చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున మనవి చేస్తూ, ఇట్టి కార్యక్రమంలో స్థానికులతో పాటు బీ.ఆర్.ఎస్ పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, వర్కింగ్ ప్రెసిడెంట్ కుంబగళ్ళ ధనరాజ్, ముఖ్య కార్యదర్శి గుట్టమీది నరేందర్, సీనియర్ నాయకులు సంఘం శ్రీకాంత్, ఉపేందర్నాధ్ రెడ్డి, మాల్యాద్రి నాయుడు, రాజేంద్రప్రసాద్, యాలాల కిరణ్, సుమనళిని, రమణ మూర్తి, కందాడ ప్రవీణ్, బొడ్డు శ్రీధర్, దుర్గేష్, హరి, బిందు లతో పాటు స్థానిక నాయకులు పెంటారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాఘవ రెడ్డి తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking