మణికొండ పాఠశాల విద్యార్థులకు సైకాలజి పాఠాలు.

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 8 మార్చి 2025
వీ ఆర్ 4 సాగయోగ్ చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ తరుణంలో ట్రస్టు సభ్యురాలు డాక్టర్ వినీల అన్నె సైకాలజిస్టు ద్వారా మణికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు రోజు వారి దినచర్యలో భాగంగా ఎన్నో విధాల లబ్ధి పొందడానికి ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు ఎలా సాగవలెనో విడమరచి చెప్పడం జరిగినది, ఆ దరిమిలా మున్ముందు ఎదుర్కొనే పరీక్షలు కానీ, ఉద్యోగ అవకాశాల సమయంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని తెలియ చేయడం జరిగినది, ఈ సందర్భముగా సైకాలజిస్టు డాక్టర్ పాఠశాల విద్యార్థులకు తన దైన శైలిలో సరళ భాషలో ఆత్మవిశ్వాసంతో సమాజములో ఎలా మసులు కోవాలో తెలియ చేసినందుకు చైతన్య వంతులైన విద్యార్థులు కృతజ్ఞతా భావంతో మసులుకొన్నారని పాఠశాల ఉపాద్యాయులు చెప్పడంతో పాటు వారి తరఫున ధన్య వాదములు తెలియ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, ట్రస్టు సభ్యులు బొడ్డు శ్రీధర్ మరియు సుమనళిని ధర్మపురి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం కావించినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking