బైపాస్ ఏర్పాటు చేయాలనీ ఎంపీ బోర్లకుంట వేంకటేష్ నేతకు వినతి పత్రం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11:
మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ మీదుగా నూతనంగా ఏర్పడబోతున్న 63 వ జాతీయ రహదారి వలన భారీగా నష్టపోతున్నామని మంగళవారం బాధితులు ఎంపీ క్యాంపు ఆఫీస్ మంచిర్యాల నందు ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతను కలిసి వినతి పత్రం ఇచ్చారు.కన్నెపల్లి,లక్షెట్టిపేట మున్సిపాలిటీ మీదుగా 63వ జాతీయ రహదారి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైంది.కాగా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని నివాస గృహాలు పెద్ద ఎత్తున చాలా మంది ప్రజలు నష్టపోవడం జరుగుతుందన్నారు.కోరుట్ల,మెట్టపల్లి,జగిత్యాల ధర్మపురి లాగా ప్రతి పట్టణం జాతీయ రహదారి పై బైపాస్ తీయడం జరిగిందని,వాటిలాగా లక్షెట్టిపేట మున్సిపాలిటీ లో బైపాస్ ఏర్పాటు చేయాలని కోరారు.అనంతరం ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత బాధితులతో మాట్లాడుతూ….ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపాలిటీ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking