ఎంపీ నామ పేదల పక్షపాతి : చిత్తారు సింహాద్రి యాదవ్

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నామను గెలిపించుకోవాలి

నేలకొండపల్లిలో నామ ముత్తయ్య ట్రస్ట్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ

ఖమ్మం ప్రతినిధి జనవరి 12 (ప్రజాబలం) ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేదలు బడుగు బలహీన వర్గాల కార్మిక పక్షపాతి అని బీఆర్ఎస్ జిల్లా నాయకులు, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ పార్టీ కార్మిక విభాగం నాయకులు కాసాని నాగేశ్వరరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో శుక్రవారం నేలకొండపల్లి ఆటో అడ్డాలో ఆటో కార్మికులకు పెద్ద ఎత్తున ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు ఖమ్మం నేలకొండపల్లి కూసుమంచి చెన్నారం ఆటో అడ్డా డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు అందజేసి, సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలంటే ఎంపీ నామ నాగేశ్వరరావు కు ఎంతో ప్రేమ అని, అందుకే ఆయన తన తండ్రి నామ ముత్తయ్య పేరు మీద ట్రస్ట్ పెట్టి, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రేమాభిమానాలు సంపాదించారని చెప్పారు. ఎంపీ గా , ట్రస్ట్ ద్వారా చేయని సేవలు లేవన్నారు. సేవకు ప్రతి రూపం ఎంపీ నామ అని అన్నారు. అడిగిన వెంటనే స్పందించే ప్రజా నాయకుడు ఎంపీ నామ అన్నారు. ఇంతటి ప్రజాభిమానం కలిగిన ఎంపీ నామను కడుపులో పెట్టుకొని, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పార్టీలకతీతంగా సేవలందిస్తున్న ఎంపీ నామను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తూ ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎంతగానో శ్రమిస్తున్న ఎంపీ నామను మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవడం ద్వారా మరింత అభివృద్ధికి అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి ఎంపీటీసీ శీలం వెంకట లక్ష్మీ , బీఆర్ఎస్ నాయకులు తన్నీరు రవి, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, నేలకొండపల్లి వార్డు సభ్యులు కొండా కనకప్రసాద్, గొలుసు రవి, స్థానిక ఆటో అడ్డా యూనియన్ అధ్యక్షులు పులిపాటి వెంకన్న , నేలకొండపల్లి – ఖమ్మం ఆటో అడ్డా యూనియన్ అధ్యక్షులు తోడేటి ఉపేందర్ తో పాటు బల్లి వెంకన్న , బల్లి వీరయ్య, ఉప్పల నాగయ్య, మందడి రామకృష్ణ, పూసపాటి అశోక్, నేలకొండపల్లి – కూసుమంచి, నేలకొండపల్లి – చెన్నారం ఆటో అడ్డా యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking