కేరళ హైస్కూల్ లో ఘనంగా సంక్రాంతి సంబురాలు

ఖమ్మం ప్రతినిధి జనవరి 12 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం
ఏదులాపురం స్థానిక కేరళ హైస్కూల్లో సంక్రాంతి సంబురాలు ఆనందోత్సవాలతో నిర్వహించారు పంచె కట్టు, సాంప్రదాయ చీరకట్టులో పాఠశాల చిన్నారులు ఈ వేడుకల్లో నూతన శోభను సంతరించుకున్నారు. విద్యార్థులంతా భోగిమంటలు వేసి ఉత్సాహంగా గడిపారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి, బొమ్మల కొలువు పెట్టారు. పాఠశాల ప్రాంగణమంతా అందమైన రంగవల్లులతో ముస్తాబు చేసి డు… డు.. బసవన్నలా ఆటా పాటా, హరిదాసుల కీర్తనలు, కోడిపందాల జోరు, గాలిపటాల సందడి , గొబ్బెమ్మ పాటలతో వేడుకలు హోరెత్తాయి.ఈ సందర్భంగా కేరళ హైస్కూల్ చైర్మన్ బైర బోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని మూడు రోజులపాటు భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలుగా జరుపుకుంటున్నామన్నారు. మన తెలుగు సాంప్రదాయాలను ముందు తరాలకు అందించడానికి ఈ సంక్రాంతి పర్వదిన వేడుకలు ఉత్సాహంగా ఉరూరా జరుపుతున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బైరబోయిన సంపత్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఆకట్టుకున్న బొమ్మల కొలువు.

సంక్రాంతి సంబరాల్లో పాఠశాల చిన్నారులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాల బొమ్మలను చిన్నారులు ఈ వేడుకల్లో పెట్టి సరదాగా గడిపారు. రంగురంగుల వివిధ వెరైటీ బొమ్మలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ బొమ్మలు, చెక్క బొమ్మలు, మట్టితో తయారుచేసిన బొమ్మలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ బొమ్మలకొలువు పాఠశాల చిన్నారుల సృజనాత్మకతకు అద్దం పట్టింది. బొమ్మల కొలువులో పాల్గొన్న విద్యార్థులను కేరళ
హైస్కూల్ చైర్మన్ బైరబోయిన శ్రీనివాసరావు డైరెక్టర్ బైరబోయిన సంపత్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking