ఎంపీ నామ మావయ్య సుబ్బారావు కన్నుమూత

సుబ్బారావు పాడె మోసిన ఎంపీ నామ నాగేశ్వరరావు

ఖమ్మం ప్రతినిధి జనవరి 29 (ప్రజాబలం) బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మావ య్య , ప్రముఖ సినీ హీరో తొట్టెంపూడి వేణు తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు ( 92 )సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని స్వగృహంలో కన్ను మూశారు. పార్థివ దేహాన్ని ఎంపీ నామ సందర్శించి, సంతాపం తెలిపి, నివాల ర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ నామ , జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని, సుబ్బారావుకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. సుబ్బారావు పాడెను స్వయంగా మోసి, రుణం తీర్చుకున్నారు. అంత్యక్రియల్లో నామ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఎంపీ నామ ను సినీ నటుడు వేణును కలిసి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking