డిసిసిబి చైర్మన్ పదవి మేకల మల్లి బాబు యాదవ్ కి ఇవ్వాలి
ఖమ్మం ప్రతినిధి జనవరి 29 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ కార్యదర్శి గుదే భద్రయ్య కొణిజర్ల మండలం యాదవ్ సంఘం కార్యదర్శి పదిమల నరేష్ లు మాట్లాడుతూ డీసీసీబీ డైరెక్టర్ గా మల్లి బాబు యాదవ్ గత 15 సంవత్సరాల నుంచి డిసిసిబి డైరెక్టర్ గా పని చేస్తున్నారని,గతంలో కామేపల్లి జడ్పిటిసిగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, గొర్రెల పెంపకం దారుల స్టేట్ డైరెక్టర్ గా అనుభవమున్న మల్లి బాబు యాదవ్ కి డిసిసిబి ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ఖమ్మం జిల్లా కు చెందిన తెలంగాణ రాష్ట్ర మంత్రులను కోరడం జరిగింది దాదాపు 30 సంవత్సరాల నుండి బీసీ సంఘాలలో మరియు యాదవ సంఘం లో, గొర్రెల పెంపకం సహకార యూనియన్ చైర్మన్ గా పనిచేసి, అగ్రకుల రాజకీయాల, మరియు టిఆర్ఎస్ పార్టీ రాజకీయ కుట్రలకు 57రోజులు జైలు జీవితం గడిపిన మల్లి బాబు యాదవ్ ను దృష్టిలో పెట్టుకొని ఒక బీసీకే డీసీసీబీ ఇయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొణిజర్ల మండలం అనేక గ్రామాల నుంచి వచ్చిన యాదవ కురుమ అధ్యక్షులు కొణిజర్ల గ్రామ అధ్యక్షులు చింతల ఎల్లి బాబు కొణిజర్ల గ్రామ కార్యదర్శి ముత్తయ్య ,సాలబంజర గ్రామ అధ్యక్షులు తుప్పత్తి వెంకటేశ్వర్లు ,కొణిజర్ల గొర్ల పెంపకదారుల సహకార సంఘం సభ్యులు బండారు కిషన్ రావు, తద్దె మహేష్, లాలాపురం అధ్యక్షులు ఇమ్మడి రామారావు లాలాపురం ,చైర్ పర్సన్ కూరాకుల నర్సయ్య కూరాకుల నాగరాజు తుమ్మలపల్లి కార్యదర్శి చింతల లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.