సీ ఎం ఆర్ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు,

 

మిల్లర్లు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణమిస్తాము ,

 రైస్ మిల్లర్లకు తేల్చి చెప్పిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

తేది 29-01-2024
మెదక్ జిల్లా,జిల్లాలో అధిక శాతం సీ ఎం ఆర్ పెండింగ్ వున్నా మిల్లుల యజమాన్యులతో మిల్లుల వారీగా సోమవారం IDOC లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అదనపు కలెక్టర్ వెంకటేష్ తో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈసందర్భముగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన గడువు ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చిందని , అప్పటి లోగా బియ్యం పెట్టని మిల్లుల యజమానులపై ఆర్ ఆర్ యాక్ట్ క్రింద స్థిర చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా , క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు . నెలలు గడుస్తున్నా మిల్లర్లు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణమిస్తామని హెచ్చరించారు .
సీఎంఆర్ కేటాయింపులపై కూలంకషంగా చర్చించారు. రైతుల నుండి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి సమకూర్చిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరుపుతూ ఈ నెలాఖరు లోగా నిర్దేశిత కోటాకు అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలను భారత ఆహార సంస్థకు చేరవేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తూ, నిబంధనలను ఉల్లంఘించే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని కరాఖండీగా తేల్చిచెప్పారు.

సీఎంఆర్ కేటాయింపుల్లో జాప్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నందున, ఇకపై మిల్లర్ల అలసత్వాన్ని తాము ఎంత మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లాలోని రైస్ మిల్లులలో సీ.ఎం.ఆర్ కేటాయింపుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ధాన్యాన్ని కొనుగోలు చేసి అయినా నిర్ణీత గడువులోపు లక్ష్యానికి అనుగుణంగా సీఎంఆర్ డెలివరీ చేయాలని మిల్లర్లకు తేల్చి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని రైస్ మిల్లులలో తప్పనిసరిగా పూర్తి స్థాయి సామర్ధ్యానికి అనుగుణంగా కస్టమ్ రైస్ మిల్లింగ్ జరుపుతూ, ఈ నెలాఖరు లోపు ఎఫ్ సీ ఐ కి నిల్వలు చేరవేయాలని గడువు విధించారు.

అవసరమైతే ప్రైవేట్ ధాన్యం మిల్లింగ్ కు విరామం ఇచ్చి, సీ.ఎం.ఆర్ లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తంలో బాయిల్డ్ రైస్ నిల్వలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ , డి సి ఎస్ ఓ బ్రహ్మరావు , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking