జాతర ఏర్పాటు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జనవరి 29

మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ లో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు దర్శనం చేసుకుని దానికి గల ఏర్పాట్లను అమ్మవార్లకు కొబ్బరికాయ కొట్టి మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కేశవపురంలో నిర్వహిస్తున్న సమ్మక్క జాతరను ఈసారి కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. భక్తులకు కావాల్సిన మంచినీటి సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం లాంటివి చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పాతకాల రమేష్ ,శానిటేషన్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking