ఫోన్ లో శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ నామ
వెంకట్రావమ్మ మృతికి కొండబాల, కనకమేడల , చిత్తారు సింహాద్రి తదితరుల సంతాపం
ఖమ్మం ప్రతినిధి జనవరి 17 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని నారాయణ పురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ రైతు సంఘం మండల అధ్యక్షులు కాకాని శ్రీనివాసరావు మాతృమూర్తి కాకాని వెంకట్రావమ్మ దశ దిన కర్మ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, కాకాని శ్రీనివాసరావు కు ఫోన్ చేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకట్రావమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని ఎంపీ నామ ఈ సందర్భంగా దైవాన్ని ప్రార్ధించారు. దైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు.
పలువురి సంతాపం
కాగా కాకాని వెంకట్రావమ్మ దశ దిన కర్మ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో పాటు ఎంపీ క్యాంప్ కార్యాలయం నుంచి పలువురు హాజరై, మృతురాలి చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, నివాలర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్రం చేశారు. దైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ఓదార్పు కల్పించారు. కార్యక్రమంలో ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ , జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ , పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లిఖార్జునరావు , కార్యదర్శి మోదుగు నాగేశ్వరరావు , రైతు సమన్వయ సమితి నాయకులు వేమూరి ప్రసాద్ , ఏఎంసీ డైరెక్టర్ కంచర్ల బాబు , తన్నీరు రవి , ఇటికాల శ్రీను , చావా హన్మంతరావు , మంకెన రమేష్ , చీకటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.