అనంతరం రోడ్డు భద్రత మాసోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరణ
ఖమ్మం ప్రతినిధి జనవరి17 (ప్రజా బలం) ఖమ్మం ఇటివలే జిల్లాకు బదిలీపై వచ్చిన జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్ గౌస్‌పాషా బుధవారం నూతన కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు అనంతరం ఫిబ్రవరి, 14 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎక్కువ జనసమూహం ఉండే ప్రదేశాలలో కళాశాలల వద్ద ప్రదర్శించే విధంగా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు మోటారు వెహికిల్ ఇన్స్‌పెక్టర్ వరప్రసాద్ సిబ్బంది తదితరులు వారి వెంట పాల్గొన్నారు