రామచంద్రయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ నామ నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి జనవరి 24 (ప్రజాబలం) ఖమ్మం బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం నగరంలో పర్యటించి, పలు కుటుంబాలను పరామర్శించారు. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ కు చెందిన దేవులపల్లి రామచంద్రయ్య గౌడ్ మృతి చెందగా ,వారి నివాసానికి వెళ్లి రామచంద్రయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి, సంతాపం తెలిపి, నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్థిoచారు. ఈ సందర్భంగా వారి కుమారుడు, అల్లుడు గునుగుంట్ల శ్రీనివాస్ గౌడ్ (వాసు), కుటుంబ సభ్యులను ఎంపీ నామ పరామర్శించి, ఓదార్చారు. దైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.