వద్దిరాజు రవిచంద్రకు ఎంపీ నామ నాగేశ్వరరావు శుభాకాంక్షలు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 15 (ప్రజాబలం) ఖమ్మం
రాజ్యసభ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు రవిచంద్ర కు పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అభినందనలు తెలిపి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు నామ గురువారం పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. వద్దిరాజు రవిచంద్రకు రెండోసారి అవకాశం కల్పించినందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నామ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ప్రజా సమస్యలపై తన వాణిని బలంగా వినిపించడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో ఆయనకు కేసీఆర్ మరోసారి పెద్దల సభకు అవకాశం కల్పించి, బీఫామ్ కూడా ఇచ్చారని నామ పేర్కొన్నారు.భవిష్యత్ లో రాజ్యసభ లో మరింత చైతన్యంతో రాష్ట్ర సమస్యలపై మరింతగా తన గళాన్ని వినిపించాలని నామ నాగేశ్వరరావు ఆకాంక్షిoచారు.కేసీఆర్ నాయకత్వంలో అందరం సమైఖ్యoగా పని చేసి, బీఆర్ ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తామని నామ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking