రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్ష్యంలో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ పూర్తీ
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లో జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్ష్యంలో జిల్లా లో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ పూర్తీ అయినది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లో ఈ నెల 5 నుండి ప్రారంభమైన ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలైన ఈవీఎం, వివి ఫ్యాట్, బ్యాలెట్ బాక్స్ ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ ఈ నెల 15 నాటికీ పూర్తయిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియలో 26 మంది ఈ సి ఐ ఎల్ ఇంజినీర్ల బృందం సహకారం తో ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల ను చెకింగ్ చేయడం జరిగింది. 14 , 15 తేదీలలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్ష్యంలో మోక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఏవిఎం గోడౌన్లలో భద్రపరిచి సీల్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపినారు.
ఈ కార్యక్రమంలో డి. ఆర్. ఓ. హరిప్రియ , తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.