రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 ఫిబ్రవరి 2024:
మణికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి చదువుతున్న 206 మంది విద్యార్థులకు సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించడానికి ముందుగా విద్యార్థిని విద్యార్థులు ఆకలితో అలుమటించకుండా సరియైన సమయానికి మణికొండ లోని ఆల్ కాలనీ ఫెడ్రేషన్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ పుణ్య దంపతుల యొక్క పెండ్లి రోజు సందర్భంగా హల్దీరాంస్ సేవ్ ముర్ముర ప్యాకెట్లు వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో వితరణ గావించినారని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు, కన్వీనర్ నిర్మల్ చంద్ లు తెలియ పరుస్తు ఇట్టి సేవా కార్యక్రమాన్ని సద్వినియోగ పరచు కొన్న పుణ్య దంపతులు: కల కాలం కలసి మెలసి తోడు నీడగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో శత వసంతాలు హాయిగా జీవించాలని ఆ దేవ దేవుని ప్రార్థించడం జరిగినదని, ఈ శుభఘడియలలో ట్రస్ట్ సభ్యులు అందె లక్ష్మణ్ రావు, నిర్మల్ చంద్ గోలేచ, ఉపేంద్ర రెడ్డి, సామాజిక అనుసంధాన కార్యకర్త శివరామకృష్ణ, గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్ లో నివసించే వరిష్ఠ నాగరికుల సంఘ సభ్యులు మరియు పాఠశాల ఉపాధ్యాయులందరూ అతి ఉత్సాహంతో పాల్గొన్నారని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరచినారు.
