సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్న నాయకులు గడప దేవేందర్, ప్రముఖులు.

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో సంత్ శ్రీ సేవాలాల్ 285 ఘనంగా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆటపాటలతో విన్యాసాలు, బారి ర్యాలీ, హాజరైన ప్రముఖులు. సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు ప్రత్యేక పూజల్లో ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ అమర్ సింగ్
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు మత్స కారుల సంఘం నాయకులు గడప దేవేందర్.


నాయకులు గడప దేవేందర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ బాగా చదువుకోవాలని చదువుతోనే జ్ఞానం సంపద పెరుగుతుందని వారి కుటుంబాలు బాగుంటాయని రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారని, సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించినందుకు, ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు ప్రభుత్వం సహకరిస్తున్నందుకు , ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మెదక్ జిల్లా బంజరాల ఐక్యవేదిక అద్యక్షుడు రాథోడ్ జయపాల్ నాయక్ మాట్లాడుతూ
రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
పేదల రాజ్యం రావాలని ,
సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా
అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని
చదువులను తండాకు తీసుకెళ్లే
బాధ్యత ప్రభుత్వ అధికారులది
గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత ప్రభుత్వానిది.
గ్రామ పంచాయతీలుగా మారిన తండాలకు పంచాయతీ భవనాలు నిర్మించాలి.
అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ లో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది.
చదువుల బాట పట్టండి.. సంత్ సేవాలాల్ మార్గంలో నడవండి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్, ప్రధాన కార్యదర్శి
గడ్డం ప్రశాంత్ కుమార్, నాగరాజు యాదవ్ , మహమ్మద్ హైమద్, గౌస్ ఉద్దీన్, యూత్ నాయకులు శివ, నర్సింలు , లంబాడి ఐక్యవేదిక నాయకులు, మహిళలు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking