అధునాతన సౌకర్యాలతో నూతన భవనంలో భరోసా కేంద్రం ఏర్పాటు
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు మంత్రి సి. దామోదర రాజనర్సింహ
మెదక్ ప్రాజబలం న్యూస్:-
టీజింగ్ కు గురైన మహిళలలు , అమ్మాయిలు ,పిల్లలు
లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలకు,మహిళలకు,అత్తింటి వారి ఆగడల బారిన పడిన మహిళలు,గృహహింస కు గురైన మహిళల కోసం భరోసా కేంద్రం లో మహిళలకు రక్షణ కోసం, రాత్రి నిద్రించేందుకు వసతి కోసం, కౌన్సిలింగ్ కోసం ,న్యాయ సహాయం కోసం,అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించడం కోసం ఆధునిక హంగులతో నూతన భవనాన్ని , పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి సి. దామోదర రాజనర్సింహ , జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక ఏం. ఎల్. ఎ . Dr . రోహిత్ రావు, తో కలిసి 2 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ”, షీ” టీమ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్లాండ్ ఫార్మ సి ఎస్ ఆర్ ఫండ్స్ సౌజన్యంతో అధునాతన భరోసా కేంద్రాన్ని నిర్మించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2022 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 135 కేసులు నమోదు అయ్యాయని , వారికి సుమారు 27 లక్షల పైచిలుకు ఆర్థిక సహాయం చేశామన్నారు.
కేసు నమోదు అయినప్పుడు ఆర్థిక సహాయం చేయలన్నారు.
చివరగా జడ్జ్మెంట్ వచ్చినప్పుడు సంపూర్ణ ఆర్థిక మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు.
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు .
భరోసా కేంద్రం లో శారీరకంగా, మానసికంగా, లైంగికంగా సమాజంలో వేధింపులకు గురైన, అత్యాచారాలకు గురైనా బాధితులకు తక్షణం అండగా నిలిచేందుకు, పోక్సో కేసులలో మహిళలకు, పిల్లలకు స్వాంతన చేకూర్చడానికి కౌన్సిలింగ్, రిహాబిలేషన్ సెంటర్ గా ఈ భరోసా కేంద్రం ద్వారా పోలీసులు , మానసిక కౌన్సిలింగ్ నిపుణులు ద్వారా బాధిత మహిళలకు, పిల్లలకు అండగా నిలిచేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు.
బాధిత మహిళలకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు .

మానసిక వేదనకు గురికాకుండా కాపాడే విధంగా ఈ భరోసా సెంటర్ పనిచేస్తుందని తెలిపారు.
భరోసా కేంద్రలు లేని జిల్లాలో త్వరలో ఏర్పాటు చేస్తాం అన్నారు. భరోసా కేంద్రంలో మంత్రివర్యులు మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో డి ఐ జి రెమా రాజేశ్వరీ , జిల్లా ఎస్ పి Dr . బాలస్వామి , డి ఏం & హెచ్ ఓ చందు నాయక్ ,జిల్లా సంక్షేమాధికారిణి బ్రహ్మాజీ ,స్థానిక , మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్ , గ్లాండ్ ఫార్మ ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు .
