పెన్షనర్స్ అసోసియేషన్ క్యాలెండర్,డైరీని ఆవిష్కరించిన ఎంపీ రవిచంద్

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 28:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చేతుల మీదుగా ఆవిష్కరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రముఖులు ఈ.నర్సింహారెడ్డి,జి.వీరస్వామి,కె.సమ్మారెడ్డి,కె.సుధీర్ బాబు, ఎస్.రాజయ్య,జి.సత్యనారాయణలతో సమావేశమై ఆయన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ వారు వరంగల్ నగరంలోని తమ కార్యాలయానికి కావలసిన ఫర్ణీచర్ కొనుగోలు కోసం ఎంపీ రవిచంద్ర ను కోరగా ఆయన స్పందించి వెంటనే స్నేహ పూర్వకంగా ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బొలుగొడ్డు శ్రీనివాస్, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking