ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
ఎవరెన్ని ఆరోపణలు చేసిన ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నాం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కుటిల రాజకీయాలు మాని, ప్రజా సేవ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలకు హితవు పలికిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, వెంటనే తన అసత్య ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
లక్ష్మణచాంద మండల కేంద్రంలో రూ. 50 లక్షలతో
శ్రీ రామాలయం, రూ..30 లక్షలతో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయాల నిర్మాణాలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి, స్థానికంగా తనకున్న ప్రజాదరణను తట్టు కోలేకే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం,కుటిల రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ స్థల ఎంపిక తాము చేసింది కాదని, రాష్ట్ర స్థాయి కమిటీ నివేదిక మేరకే అక్కడ కలెక్టరేట్ భవన్ నిర్మాణం జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. కానీ నిర్మల్ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ కోసం స్థల ఎంపిక విషయంలో పనిగట్టుకొని బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎవరెన్ని ఆరోపణలు చేసిన నిర్మల్ నియోజకవర్గ అభివృద్ది కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. తన స్వగ్రామం ఎల్లపల్లి శివారులో తనకు, నా కుటుంబ సభ్యులకు భూములు ఉన్నందు వల్ల ఇక్కడ కలెక్టరేట్ నిర్మాణం చేస్తున్నామని విమర్శలు చేస్తున్నవారు…. అక్కడ భూములు ఉన్నట్లు నిరూపిస్తే.. ఆ భూములన్నింటిని తెల్లకాగితం మీద సంతకం చేసి వాళ్ళకే రాసిస్తానని సవాలు విసిరారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు నిరాధార ఆరోపణలు చేయడం మానుకొని ప్రజలకు సేవ చేయాలని సూచించారు.ప్రజా సేవ చేయడం మానివేసి కేవలం రాజకీయ విమర్శలు చేస్తే ప్రజలు సహించరని, ప్రజలు తెలివైన వారని ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసని వాఖ్యానించారు…