ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..పవిత్ర పుణ్యక్షేత్రం చదవుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో మంగళవారం ఆలయ హుండీను మండపంలో లెక్కించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి విజయ రామారావు, వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పటాక్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నిర్మల్ జిల్లా రంగు రవి కిషన్ ఆధ్వర్యంలో 40రోజుల హుండీల్లను లెక్కించగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తులు తమ కానుక రూపంలో సమర్పించిన నగదుతో పాటు బంగారం, వెండి, విదేశీ డాలర్లు వచ్చాయి. నగదు రూ. 65 లక్షల 68 వేల 864లు, మిశ్రమ బంగారం 102 గ్రా, మిశ్రమ వెండి 02కి౹౹340గ్రా.లు, విదేశీ కరెన్సీ19 వచ్చాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది, హోంగార్డ్స్, వాగ్దేవి సొసైటి సభ్యులు, రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు, నిర్మల్, నిజామాబాద్ ,కామారెడ్డి, జిల్లాల వారు పాల్గొన్నారు.