ఆర్జీయూకేటీ ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. రాజీవ్ గాంధీ శాస్త్రసాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటీలో జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. క్లాసులు బోధిస్తున్న ఆధ్యాపకులను, విద్యార్థులను పలు విషయాలు ఆడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీ అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. కలెక్టర్ వరుణ్ రెడ్డిని ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ అర్జీయూకేటీ క్యాంపస్ లో గల పరిపాలన భవనం వద్ద పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఆర్జీయూకేటీ క్యాంపస్లో గల స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్ ఆడిటోరియంలో ఈ- సెల్, అటల్ ఇన్నోవేషన్ సెంటర్, టీ-హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎలా ఎదగాలి అనే కార్యక్రమానికి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, ఏఐసిటీ హబ్ సీఈవో రాజేష్ కుమార్తో కలిసి కలెక్టర్ వరుణ్ రెడ్డి హాజరయ్యారు. తదనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తన నేపథ్యాన్ని వివరిస్తూ ఐఐటి బాంబేలో బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశానని, విద్యార్థులు ఎప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావంతో వచ్చే సమస్యల నుండే పరిష్కార మార్గాలను నూతనంగా కనుగొనగలగడమే నూతన ఆవిష్కరణగా చెప్పవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రధానంగా ఆవిష్కరణ, వ్యవస్థాపకతపై దృష్టిసారించాలని, ఎంటర్ప్రైన్యూర్ షిప్ ఎలా మొదలవుతుందని ప్రత్యేకమైన కాన్సెప్ట్ ద్వారా వివిధ అంశాలని ఒక మెథడాలజీతో అర్థం చేసుకోవడంలో లక్ష సాధన చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉండాలని తెలిపారు. అర్జీయూకేటీ విద్యా సంస్థ ఒక ప్రత్యేకతను కూడి ఉందని, చదువుకుంటున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు కష్టించి తమ లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ హాప్ వెళ్లి సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ, చైతన్య, నికిత అసోసియేట్ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.