మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-సాగు
మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇమాంపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో సేద్యం చేస్తూ పంటలు పండిస్తున్న భూములను ప్రభుత్వం తీసుకోదని తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ స్పష్టంచేశారు. మంగళవారం అల్లాపూర్ శివారులోని 318 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిని సర్వే చేస్తుండగా ఇమాంపూర్ రైతులు మా భూమి పోతుందేమోనని ఒకింత అయోమయానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ ఇమాంపూర్ సర్పంచ్ సమక్షంలో భూమి తీసుకోమని రైతులకు హామీ ఇచ్చారు. దీనితో రైతులు ధీమాతో వెళ్లారు.