తక్షణ సహాయంగా 50 వేల రూపాయలను అందించిన ఎమ్మెల్యే కందాళ
ఖమ్మం ప్రతినిధి జులై 28 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ కి చెందిన పెండ్ర సతీష్ గారు నిన్న తన ఇంటిలో సామాన్లు తెచ్చుకునేందుకు వెళుతుండగా వరద తాకిడికి గల్లంతై మృతి చెందారు ఈవిషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పెండ్ర సతీష్ భౌతికకాయానికి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణ సహాయంగా 50,000/- రూపాయలను అందించారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండలం ఎంపీపీ బెల్లం గూడ సంజీవరెడ్డి బెల్లం వేణుగోపాల్ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు