సేవా స్ఫూర్తి ప్రదాత-బొగ్గారపు బ్రహ్మానందం

విశ్వజనని వ్యవస్థాపక అధినేత
సేవా జగతికి ఆశయ దూత
ప్రతిరోజు ఒక సాంస్కృతిక ఉత్సవం
కళాకారుల పాలిటవరం
కళలను గుర్తించిన వైనం
ఏడాది పొడవునా సాంస్కృతిక మేళా
ఖర్చుకు వెనకాడని ఆనందపు కళ
వెరచి నరసరావుపేటలో ఉదయించిన బ్రహ్మానందం గారు
విశిష్ట సేవ పురస్కార విజేత
ప్రపంచ కళాకారులను తమ నగరానికి రప్పించిన ఘనత
సేవా తత్పరతలో సాటిలేని మేటి కళామతల్లి ముద్దుబిడ్డ
మురిసి మైమరిసిన తెలుగు గడ్డ..
సేవా తత్పరతకు నిదర్శనంగా ఎన్నెన్నో అవార్డుల వరుస
సేవ కోసమే బ్రహ్మ సృష్టించిన
ఆనంద బ్రహ్మ..
అవధిలేని అవార్డుల సాగరంలో మరి ఒక అపురూప అవార్డు
కోడి రామకృష్ణ సంస్థ కానుక
అభిమానులకు అత్యంత వేడుక
అత్యుత్తమ పురస్కారం
సేవా తత్పరతకు సత్కారం
ఎందరో పుడతారు పుడమిలో
కొందరే నిలుస్తారు ప్రజలు హృదయాల్లో
కళలతో మానసిక వైద్యం చేసే కళాకారులను గుర్తించి గౌరవించిన
బ్రహ్మానందం గారు చిరస్మరణీయులు
ఆయనలోని సుగుణాలకు
అవార్డులు రివార్డులు సరిపోవు
విశ్వజనని అధినేతగా
విశ్వానికే ఆయన విఖ్యాతుడు
దిన దినం అంగరంగ వైభవంగా మీ సేవా నిరతి కొనసాగాలి
ఎందరో కళాకారులకు హృదయమై ఎదగాలి మీరు
కోడి రామకృష్ణ అవార్డు అందుకున్న మీకు అక్షర సాహితీ నీరాజనాలు..
సాహితీ వీణా కుసుమాల సమూహ శుభాకాంక్షలు
‌ సాహితీ రత్న శ్రీమతి సత్య వీణ మొండ్రేటి ..హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking