జోగులాంబ గద్వాల జూలై 29 ;మొహర్రం..హిందూ, ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం అని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ అన్నారు. మొహర్రం..పర్వదినం పురస్కరించుకొని ఆయన ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొహర్రం శుబాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్యాగాలకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా హిందూ, ముస్లిం సోదరులు తరతరాలుగా మొహర్రం పండుగను నిర్వహిస్తున్నారన్నారు.ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.నాటి కాలంలో ఇమామ్ హసన్, ఇమామ్ హుస్సేన్ సహా పలువురి త్యాగాలను స్మరించుకుంటూ మొహర్రం సాగుతుందన్నారు.త్యాగాలకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా హిందూ, ముస్లిం సోదరులు తరతరాలుగా మొహర్రం పండుగను నిర్వహిస్తున్నారని తట్టే మహేష్ గుర్తు చేశారు.పీర్ల పండుగ పేరుతో తెలంగాణలో హిందూ, ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మొహర్రం నిలిచిందన్నారు. హిందువులు హసన్, హుస్సేన్‌లను ఆశన్న, ఊశన్నలనే పేర్లతో పీరీలను ఎత్తుకొని పాటలు పాడుకుంటూ, నాటి వారి త్యాగాలను పేరుపేరునా కీర్తిస్తూ, త్యాగానికి చిహ్నంగా నిప్పుల గుండాల పై నడుస్తారని తెలిపారు. గంగా జమున తెహజీబ్‌కు ప్రతీకగా నిలిచి, దేశానికే ఆదర్శంగా లౌకికవాద స్ఫూర్తిని మొహర్రం నింపుతున్నదన్నారు..