గో సేవా విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మధుసూదన్

హైదరాబాద్ జూలై 29 ;ఐపిసి క్యాంప్ ఆఫీస్ లిబర్టీ ప్లాజా బషీర్బాగ్ హైదరాబాద్ నందు డాక్టర్ మధుసూదన్ ను గో సేవా విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు కేబీ శ్రీధర్ సమక్షంలో గోసేవ విభాగం జాతీయ అధ్యక్షులు కే వి ఎన్ శర్మ నియమించారు.ఈ సందర్బంగా మధుసూదన్ మాట్లాడుతూ ఐపీసీ పంచ సూత్రాలకు ఆకర్షితునై ఐపిసి లో చేరినట్లు తెలుపుతూ త్వరలోనే తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించి అన్ని జిల్లాల్లో గో సేవ విభాగాల కమిటీలను నియమించి ఐపీసీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే దిశగా పని చేయనున్నట్లు తెలిపారు .డాక్టర్ మధుసూదన్ కరణం శేష సైనా రావు ని గోసేవ విభాగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా నియమించారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు కేబీ శ్రీధర్ గో సేవ విభాగం జాతీయ అధ్యక్షులు కేవీఎన్ శర్మగారు ఐపీసీ పార్టీ కండువాలతో వారికి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో ఐపిసి మహిళా విబాగం నాయకురాలు చిత్ర తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking