ఖమ్మం ప్రతినిధి జులై 29 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలో వేద పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో శనివారం ఆయన పర్యటించారు. శ్రీనివాసనగర్ లోని సత్యసాయి ఆశ్రమంలో జరిగిన బ్రహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే జిల్లాలో వేద పాఠశాల, బ్రహ్మణ కులస్తుల కోసం ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్ తో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా సరితా క్లినిక్ సెంటర్ లో తలసేమియా వ్యాధితో బాధపడుతూ మృతిచెందిన శీనం కిరణ్ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన శీనం కిరణ్ తల్లిదండ్రులను, రక్తదాతలను ఆయన అభినందించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్ యాదవ్, మలీదు జగన్, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కొప్పెర ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ నగర ఓబీసీ ఛైర్మన్ బాణాల లక్ష్మణ్, పీఎస్ఆర్ యూత్ నాయకులు దుంపల రవి కుమార్, మైనారిటీ నాయకులు ఇమామ్ భాయ్, మియా భాయ్, కొంగర జ్యోతిర్మయి, బోడా శ్రావణ్ కుమార్, పాలకుర్తి నాగేశ్వరరావు, కొట్టె ప్రసాద్, కొట్టె నాని, తోట ప్రసాద్, కె.వి. చారి, ధారమళ్ళ భాస్కర్ రావు, వేముల సీత, కాంపాటి రమేష్, మొగిలిచర్ల సైదులు, ఉత్తేజ్, బీరేష్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కిలారు మనోహర్, మందడపు తిరుమలరావు, మదన్, చల్లగుండ్ల సురేష్, యువనేత గోపి తదితరులు ఉన్నారు.