– సీసీ కెమెరాల ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా సెప్టెంబర్ 26 : ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని సిసి టివి కామైండ్ కంట్రోల్ రూమ్ లో సిసి కెమరాలను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జిల్లా లో మహమ్మద్ గౌస్ పల్లి నుండి మొదలు కొని జిల్లా చుట్టూ సరిహద్దు ల వరకు ప్రతి మండలంలో ప్రతి గ్రామములో సిసి కెమెరాల ను అమర్చిడం జరిగిందని సిసి కెమెరాల మూలాన నేరస్తులను కానీ ప్రమాదాలను నివారించేందుకు సులభతరం అవుతుంది అని ములుగు జిల్లా పర్యాటక కేంద్రంగా రామప్ప దేవాలయం ఆసియాలోనే అతి పెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ వాజేడు వాటర్ ఫాల్స్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లాంటి అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయని పర్యాటకుల రద్ది దృశ్య ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మూడో నేత్రం గా సిసి కెమెరాలు పని చేస్తాయని నేరం చెయ్యాలంటే నేరస్తునికి వణుకు పుట్టాలి అని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శభారిష్ ఐపిఎస్ గారు జిల్లా పోలీస్ అధికారులు అడిషనల్ ఎస్పీ OSD గారు,డీఎస్పీ,సీఐ, ఎస్ఐ
లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు