– మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి
– సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు
– మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనల్లో డ్రగ్స్ లేదా గంజాయి కారణం అవుతోందని తెలిపారు
– ములుగు జిల్లాలో పోలీసుల పని తీరు భేష్
– ములుగు జిల్లా పోలీసులను అభినందించిన మంత్రి వర్యులు సీతక్క
ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా సెప్టెంబర్ 26 : ఈ రోజు ములుగు జిల్లా లోని జాకారం లో జిల్లా ఎస్పీ డాక్టర్ శాభరిష్ ఐపిఎస్ గారి ఆధ్వర్యములో చేపట్టిన మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమములో భాగంగా నిర్వహించిన ములుగు జిల్లా యువతకు జిల్లా స్థాయి వాలి బాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు బానిసైతే ఉజ్వల భవిష్యత్తు అంధకారమవుతుందని, యువత వ్యసనాలను వీడి లక్ష్యం వైపు అడుగులేసి ఉన్నత స్థాయికి చేరుకుని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని
మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని.. కానీ చెడు వ్యసనాల కారణంగా అనారోగ్యం పాలైన చాలామంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచానికి ఉగ్రవాదం తర్వాత అంతటి పెనుసవాలుగా డ్రగ్స్ వినియోగం మారిందన్నారు.
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు కూడా డ్రగ్స్ చేరడం ఆందోళన కలిగించే విషయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మాదకద్రవ్యాల మాఫియా ప్రపంచాన్ని గడగడలాడించి, కోట్లు కొల్లగొడుతోందన్నారు. మాదకద్రవ్యాల మత్తులో లైంగిక దాడులు, హత్యలు చేస్తున్నారని, పెద్దపల్లిలో చిన్నారిపై లైంగికదాడి హత్య ఘటన మనసును కలవరపెట్టిందన్నారు.మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనల్లో డ్రగ్స్ లేదా గంజాయి కారణం అవుతోందని సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని సీతక్క గుర్తు చేశారు. అనంతరం వాలిబాల్ లో గెలిచిన విజేతలను మోడల్స్ తో సత్కరించి షీల్డ్ లు అందించడం జరిగింది.