ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఆ పార్టీ నాయకులు భారీ షాక్ లు ఇస్తున్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ,ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తామని అన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం లో 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.