ప్రజాబలం మంచిర్యాల ప్రతినిధి సెప్టెంబర్ 23 : క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని క్రీడాకారులు ఆటలో ఓడిపోయిన మాత్రమే నిరాశ పడవద్దు అని మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య అన్నారు.లక్షెటిపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న క్రీడ పోటీలు శనివారంతో ముగిసాయి.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… క్రీడాకారులు ఎప్పుడు కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆటలో గెలవని పక్షంలో మళ్లీ కఠిన సాధన చేసి గెలవాలని తెలిపారు.క్రీడలు స్నేహపూర్తి వాతావరణం లో ఆడుకున్నప్పుడే ప్రశాంతంగా జరుగుతాయన్నారు.క్రీడలు జరిగేటప్పుడు చాలామంది క్రీడా క్రీడాకారులు పలు ప్రాంతాల నుండి వస్తారని వారితో కలివిడిగా ఉండాలని అన్నారు.లక్షెట్టిపేట పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఆడడం గర్వించదగ్గ విషయం అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ ను లక్షెట్టిపేట పాఠశాల క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. అనంతరం పలుకీడ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, జెడ్పిటిసి ముత్తె సత్తయ్య, కౌన్సిలర్లు శాతరాజు రాజన్న, సురేష్ నాయక్ డిసిఒ షేర్ శ్రీధర్,ప్రిన్సిపాల్ గౌతమ్ కుమార్ రెడ్డి,ఆయా పాఠశాలల పీడీలు,పీఈ టిలు ఉపాధ్యాయులు, వివిధ రకాల పాఠాశాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.