వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు
విరాళాలు అందజేత
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి నేలకొండపల్లి మండలంలో శనివారం పర్యటిం చారు పర్యటనలో భాగంగా మండలం లోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. మండల ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని వినాయకున్ని వేడుకున్నారు. మండపానికి రూ. 5వేల చొప్పున ప్రతీ మండపానికి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు పొంగు లేటి ప్రసాద రెడ్డిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కారించారు. ఈ పర్యటనలో ప్రసాద రెడ్డి వెంట పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, కొడాలి గోవిందరావు, నెల్లూరి భద్రయ్య, చెరువు స్వర్ణ, పాకనాటి కన్నారెడ్డి, కొమ్మినేని విజయ్, పగిళ్ల పృధ్వి, పుల్లమ్మ, రామకృష్ణ, జాన్ రెడ్డి, శ్రీనాథ్, మామిడి వెంకన్న, చిలకల సీత, మధు తదితరులు ఉన్నారు.