ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 27 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణ ప్రజలకు,వర్తక వాణిజ్య వ్యాపారులకు తెలియజేయునది ఏమనగా ఆర్థిక సంవత్సరం 2022-23 ముగుస్తునందున ఇంటి పన్నులు,ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించుటకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది.సోమవారం ఈ సందర్భంగా లక్షెట్టిపేట మున్సిపాలిటీ కమీషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ….కవున పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా సకాలంలో పన్నలు చెల్లి౦చనిచో 2 % వడ్డీ తో పన్నులు చెల్లించవలసి ఉంటుంది.వర్తక వాణిజ్య వ్యాపారులు ఆర్థిక సం 2022-23 సంబందించిన లైసెన్సు లను ఈ నెల 31-03-23 లోపల తేసుకోగలరు.లేని యెడల 100% శాతం వడ్డీ తో లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది.కావున సకాలంలో లైసెన్,ఇంటి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధి కి సహకరించగలరు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ కమీషనర్ ఆకుల వేంకటేష్ తలుపారు