ములుగు మార్చ్ 27 :బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేపట్టినటువంటి హలో బిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ ములుగు జిల్లాలో హలో బీసీ చలో ఢిల్లీ వాల్ పోస్టర్లను విడుదల చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ బట్ట మురళీకృష్ణ, అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు సాధనకై ఢిల్లీ జంతర్ మంతర్ లో ఏప్రిల్ 3,4న ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని ములుగు జిల్లా బీసీ నాయకులు బీసీ కులాల వారందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అఖండ భారతం మంటే బీసీ పేద కులాలు ఆకలితో అలమటించడమేనా అని మురళీకృష్ణ అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మురళీకృష్ణ కేంద్ర రాష్ట్రాలపై మండిపడ్డారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో అగ్రకులాలకు పాలకులు. ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేశారు కానీ బీసీలను అభివృద్ధి చేయకుండా అట్టడుగులకు తొక్కి వేస్తున్నారని అన్నారు 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుండి ఒక్క బీసీ పార్లమెంటు సభ్యులు కూడా లేరని అలాగే 545 లోక్సభ సభ్యులలో బీసీలు కేవలం 96 మంది మాత్రమే ఉన్నారని ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ కనిపిస్తుందని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా 22 జిల్లాల నుంచి ఒక్క బీసీ శాసనసభ్యులు లేరు రాష్ట్రంలో 112 బీసీ కులాలు ఉండగా 14 కులాలు ఇంతవరకు ఆ అసెంబ్లీ గడప తొక్క లేదు అని ఆయన అన్నారు ఇంత తక్కువ ప్రాతినిధ్యం చూస్తే ఇదేలా ప్రజాస్వామ్యం అవుతుందని అన్నారు 52 శాతం జనాభా గల బీసీలకు ప్రాతినిధ్యం ఏది అని ఆయన మండిపడ్డారు. బీసీలు ఓట్లు వేయడానికెనా అని ఆయన అన్నారు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందనీ ఆయన ధ్వజమెత్తారు. బీసీల హక్కుల కోసం ఎన్ని పోరాటాలు చేయడానికి కైనా సిద్ధంగా ఉన్నామని 54 శాతం జనాభా గల బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డపల్లి రఘుపతి,ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంగం నాయకులు మంచర్ల నాగేశ్వరరావు,ప్రొఫెసర్ కూరపాటి లక్ష్మీనారాయణ ముంజల బిక్షపతి గౌడ్ బిసి ములుగు జిల్లా జాతీయ సంక్షేమ సంఘం మహిళా నాయకులు ఝాన్సీ,లక్ష్మి పాల్గొన్నారు