జగిత్యాల, ఫిబ్రవరి 22: ప్రార్థించే చేతుల కంటే సాయం చేసే చేతులే మిన్న అన్న నానుడిని జగిత్యాల మున్నూరుకాపు సంఘ సభ్యులు నిజం చేశారు. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కు చెందిన కట్టంగుర్ రవిందర్-లక్ష్మి ల కూతురు జోష్ణ వివాహం ఈ నెల 24 జరగనుంది. రవీందర్ నిరుపేద కుటుంబానికి చెందినవాడని తెలుసుకొన్న మున్నూరుకాపు మహాసభ సభ్యులు తమవంతుగా పెళ్లి కూతురుకు పుస్తె మట్టెలు అందించాలని నిర్ణయించారు. అనుకుందే తడవుగా మున్నూరుకాపు మహాసభ నాయకులు బండారి రాజకుమారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్, జిల్లా అధ్యక్షులు బాధినేని రాజేందర్ చేతుల మీదుగా నూతన వధువుకు పుస్తె మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా మున్నూరుకాపు మహాసభ నాయకులు మాట్లాడుతూ నిరుపేదలు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న మున్నూరుకాపులకు ఎల్లప్పుడు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి, వర్తక వ్యాపార సంఘం వ్యవస్తాపక అద్యక్షులు దీటి అంజయ్య పటేల్, పట్టణ అద్యక్షులు రంగు గోపాల్,
కౌన్సిలర్ లు బండారి నరేంధర్, తోట మల్లి కార్జున్,చుక్క నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు సిరిపురం రాజేశం, జిల్లా కార్యదర్శి బారతపు లింగా రెడ్డి, జిల్లా ప్రచార కార్య ధర్శి అమిరి శెట్టి మల్లారెడ్డి, పట్టణ ఉపాద్యక్షులు చిట్ల రవి, బట్టి వాడ సంఘం అద్యక్షులు చిట్ల అంజన్న, పోచమ్మ వాడ సంఘం అద్యక్షులు కొక్కు గంగాధర్, కళ్యాణ మండపం డైరెక్టర్ ములాసపు రాజన్న, ఆరే రాజు, మాసం రమేష్, చిట్యాల భూమరెడ్డి, కాశేట్టి తిరుపతి, జంగిలి రవి, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.