సేవే మా మార్గం
పెద్దపల్లి ఫిబ్రవరి 22 ప్రజాబలం
పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు ఆడబిడ్డల వివాహాలకు సహాయం అందించాలని కేసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ను కోరగా వెంటనే స్పందించినారు కేసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు , జిల్లా ప్రధాన కార్యదర్శి చాతళ్ళ కాంతయ్య ద్వారా పంపిణీ చేయించారు
జూలపల్లి మండల కేంద్రమంలోని సందుగుల భూపతి కుమార్తె సాయిప్రియ కు, సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఎం.డి. హలీమా కు, కుడిది అనసూయ కూతురు వనిత కు, గుగ్గిల రజిత కూతురు కీర్తన లకు ఆర్థిక సహాయం మరియు చీరలు అందించడం జరిగింది మరియు పెద్దపల్లి మండలం, ముత్తారం గ్రామానికి చెందిన సూగూరు నాగయ్య కూతురు వికలాంగురాలు అయిన స్వప్న కు పుస్తెలు మట్టెలు మరియు చీర అందించడం జరిగింది.
జనం మెచ్చిన జననేత, పేదల పెన్నిధి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, జనహృధయ నేత బొద్దుల లక్ష్మణ్ కు పెళ్లి కూతురులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేసిఆర్ సేవా దళం జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్, జిల్లా నాయకులు బింగి రాజు, అమరగాని శ్రీనివాస్ గౌడ్, జెట్టి సతీష్, రాయనవేని శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.