ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 24 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం ఖమ్మం మునిగేపల్లి గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీ ప్రజలు 3రోజులుగా శ్రీ ముత్యాలమ్మ వారి గుడిప్రతిష్ఠ ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి నూతనంగా నిర్మించిన గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ట చేసినారు.ఈ సందర్భంగా ముఖ్య అధితిగా వచ్చిన జిల్లా కాంగ్రెస్ నాయకులు రామా శ్రీను పాల్గొని వేదపండితులతో ఆశీర్వాదం తీసుకొని అమ్మవారిగుడి ప్రతిష్ఠకు తనవంతు సహాయకరంగా 50,000 రూపాయలు అలయకమిటి వారికి అందచేసినారు. ఈకార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల మోహన్, ఆలయ కమిటీ సభ్యులు గుగ్గిళ్ల వెంకటేశ్వర్లు(ఆటో),గుగ్గిళ్ల బొందయ్య, గుగ్గిళ్ల వెంకటేశ్వర్లు(కలెక్టర్),గుగ్గిళ్ల వెంకటినారాయణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు